ఉలిగేపల్లిలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం
05-09-2026 | 03:22pm
మల్దకల్ 05(విజయ క్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పరిధిలోని ఉలిగేపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల(Uligepalli Village Primary School)లో శనివారం ఉపాధ్యాయుల(Teachers)కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కుమ్మరి లక్ష్మి, కుమ్మరి తిప్పన్న ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి, అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రదీప్, ప్రధానోపాధ్యాయులు శాంతన్న, ఉపాధ్యాయులు నాగరాజ్, అశ్విని, అంగన్‌వాడీ టీచర్లు శంకరమ్మ, లక్ష్మి, మాజీ సర్పంచ్ కె. చిన్న రాముడు, నాయకులు పోలీస్ తిమ్మప్ప, రఘు, వార్డు సభ్యులు సువర్ణ రవి, సబ్బు తిమ్మప్ప, మీ సేవ భీముడు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.






