జర్నలిస్టు జిల్లా మహాసభలకు రండి..
ఎమ్మెల్యేను ఆహ్వానించిన టి యు డబ్ల్యూ జే 143 ప్రతినిధులు.
తాండూరు, సెప్టెంబర్ 25, (విజయక్రాంతి) : ఈనెల 27వ తేదీన జరిగే జర్నలిస్ట్ జిల్లా మహాసభలకు(Journalist District Conference) రావాలని వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి(Manohar Reddy, MLA of Tandur, Vikarabad district) టీయూడబ్ల్యూజే 143 H తాండూర్ ప్రతినిధులు ఆహ్వాన పత్రం అందజేశారు. ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ(Allam Narayana) నేతృత్వంలో జరిగే సభలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమం కోసం తీర్మానం చేయనున్నట్లు జర్నలిస్టు సంఘం ప్రతినిధులు తెలిపారు.
అనంతరం సభకు సంబంధించిన గొడ పత్రికను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గజ్జల శివశంకర్, రూపు సింగ్, మొగులయ్య, జుంటుపల్లి ప్రకాష్, రాజేందర్ గౌడ్, విజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.