కాబోయే యువ డాక్టర్ కి కన్నీటి వీడ్కోలు
25-09-2026 | 07:02pm
అయిజ సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): అయిజ మున్సిపాలిటీలోని తొమ్మిదవ వార్డు మాల చింతలన్న కుమార్తె పావని(Pavani) అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్(NIMS Hospital, Hyderabad) లో మరణించిదని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆమె ఇటీవల ఎంబిబిఎస్ సీట్(MBBS seat) సాధించి డాక్టర్ కావాలనే తన కలలను నేరవేర్చుకునే సమయంలో ఇలా అనారోగ్యం(Illness) తో అర్ధాంతరంగా మరణం సంబవించడం తీరని లోటని తల్లిదండ్రులు కన్నీటిపర్యంత మాయ్యారు. ఈ సందర్భంగా పావని తల్లిదండ్రులకు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.