కాంగ్రెస్ గ్రామ శాఖల నూతన కమిటీల నియామకం

05-10-2026 | 04:55pm

మల్లాపూర్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని వాల్గొండ, పాత దామరాజ్‌పల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల నూతన కమిటీలను నియమించారు. మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్ల సోమయ్య(Matla Somaiah) ఆధ్వర్యంలో ఈ నియామకాలు చేపట్టారు. వాల్గొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడిగా లంబాడిపెల్లి రాజేందర్, ఉపాధ్యక్షుడిగా కటికల గంగాధర్‌ను నియమించారు. పాత దామరాజ్‌పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడిగా గడ్డం రాజేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఆరెల్లి ఎల్లా గౌడ్‌ను నియమించారు.

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన గ్రామ శాఖ అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లాల జలపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నల్ల రాజన్న, ఎం.డి. జమాల్, రోడ్ల రాజారెడ్డి, కిరణ్, కోటగిరి ఆనంద్ గౌడ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు