భారాస పాలనలో నర్సాపూర్ అభివృద్ధి కుంటుపడింది

08-09-2026 | 12:09am

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం

నర్సాపూర్:  గత భారాస ప్రభుత్వ హయాంలో నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పీసీసీ పిలుపు మేరకు సోమవారం నర్సాపూర్‌లో విజయోత్సవ వికాస యాత్ర నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో మల్లన్నగుడి నుంచి చౌరస్తా వరకు యాత్ర కొనసాగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారెంటీల అమలుతో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, పంట రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.నియోజకవర్గ అభివృద్ధిపై భారాస నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. గత పాలనలో నిలిచిపోయిన అభివృద్ధిని గాడిలో పెడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు