16 August, 2026 | 11:50 AM

Districts - Medak

article_59270750.webp
నిరుద్యోగ యువతకు ‘ఉద్యోగ మిత్ర’ అండ

నర్సాపూర్ : లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ సాయికృష్ణ ఫంక్షన్ హాల్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వయంగా రక్తదానం చేయగా, ఆమె అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘సునీతమ్మ ఉద్యోగ మిత్ర’ యాప్‌ను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం ఉచితంగా నాణ్యమైన శిక్షణ, స్టడీ మెటీరియల్ అందించాలనే ఉద్దేశంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు ఆమె తెలిపారు.

16-08-2026

article_82460945.webp
స్వచ్ఛ కార్మికులకు దుస్తులు, సామగ్రి పంపిణీ

నర్సాపూర్: మున్సిపల్ స్వచ్ఛ కార్మికుల సంక్షేమం(Welfare of Municipal Sanitation Workers), ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా వారికి కొత్త దుస్తులు, ఆఫ్రన్స్‌తో పాటు ప్రజారోగ్యానికి అవసరమైన సామగ్రిని మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి మాచునూరి లక్ష్మీరాజు యాదవ్, కమిషనర్ చెరుకు సాయికుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. స్వచ్ఛ కార్మికులు ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నందున వారికి అవసరమైన రక్షణ సామగ్రి, దుస్తులు అందజేసినట్లు వారుతెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు అఫ్రీన్, మహమ్మద్ జరీనా బేగం, దుర్గప్ప సరళ, అంతారం సుధీర్ గౌడ్, చింతకుంట శ్రీకాంత్, మన్నె నిరంజన్ దాస్, మేనేజర్ వైట్ల మధుసూదన్‌తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

14-08-2026