ఇళయరాజా కాపీరైట్ వివాదం..

02-10-2026 | 05:00am

సుప్రీంకోర్టు సంచలన తీర్పు 

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా(Ilaiyaraaja)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ‘మూడు పాని’ సినిమాలోని ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాట కాపీరైట్(Copyright) వ్యవహారంలో అత్యున్నత నాయస్థానంలో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ కాపీరైట్ వివాదానికి సంబంధించి ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

గతంలో ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సంపూర్ణంగా సమర్థించింది. ఒక పాట రూపుదిద్దుకోవడంలో వివిధ వ్యక్తుల పాత్రలు వేర్వేరుగా ఉంటాయని, అందువల్ల సంగీత దర్శకుడికి కేవలం ఆయన స్వరపరిచిన బాణీపై మాత్రమే హక్కులుంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కాపీరైట్ చట్టాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక పాటలో ఉన్న సాహిత్యం హక్కులు, ఆ పాట సౌండ్ రికార్డింగ్, ప్రొడక్షన్ హక్కులు సదరు సినిమా నిర్మాతకే చెందుతాయని వెల్లడించింది. కేవలం మ్యూజిక్ కంపోజ్ చేసినంత మాత్రాన పూర్తి పాటపై సంగీత దర్శకుడికి సర్వహక్కులు రావని కోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చరిత్రాత్మక తీర్పుతో ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘సరిగమ’కు భారీ ఉపశమనం లభించింది. సంగీత పరిశ్రమలో ఆడియో రైట్స్, రాయల్టీ వ్యవహారాలపై ఈ సంచనల తీర్పు రాబోయే రోజుల్లో కీలక ప్రభావాన్ని చూపనుంది.

మరిన్ని వార్తలు