విద్యార్థులతో కలిసి భోజనం.. సమస్యలపై ఆరా
19-09-2026 | 06:09pm
జైనూర్,(విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాధవ్ అంబాజీ(Deputy Director Jadhav Ambaji) శనివారం జైనూర్ మండలంలోని పానాపటార్, మార్లావాయి, కోహినూర్ ఆశ్రమ పాఠశాలలను(Ashram school) సందర్శించి విద్యార్థులకు అందుతున్న వసతి, భోజనం, విద్యా సౌకర్యాలను పరిశీలించారు. పానాపటార్ పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల(Students) సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.