దౌలాపూర్ పాఠశాలలో అట్టహాసంగా పీటీఎం న్యూట్రిషన్ డే..
19-09-2026 | 10:03pm
పాపన్నపేట,సెప్టెంబర్19: మండల పరిధిలోని దౌలాపూర్ పాఠశాలలో శనివారం పీటీఎం న్యూట్రిషన్ డే (PTM Nutrition Day) వేడుక అట్టహాసంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రేషబోయిన అంజయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్ చేతులమీదుగా విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులను పంపిణీ చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగరాణి, ఉపాధ్యాయులు స్వప్న, అంగన్వాడీ కార్యకర్త సంగీత తదితరులు పాల్గొన్నారు.