4 September, 2026 | 9:26 PM

అహ్మదీపూర్‌లో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

04-09-2026 | 08:16pm

గజ్వేల్: అనారోగ్యంతో ఆస్పత్రి ఖర్చులు భరించిన అహ్మదీపూర్‌(Ahmedabad) గ్రామానికి చెందిన నలుగురు బాధితులకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను(CM Relief Fund cheques) మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ అందజేశారు. మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR), ఎమ్మెల్సీ యాదవ రెడ్డి సహకారంతో మంజూరైన ఈ చెక్కుల విలువ మొత్తం రూ.1,15,500. భీమ చంద్రకళకు రూ.58 వేలు, డప్పు రేఖకు రూ.16 వేలు, బోయిని రాములుకు రూ.17,500, చాడ నారాయణరెడ్డికి రూ.24 వేలు అందించారు. ఈ సందర్భంగా మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికంగా సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు మంజూరు చేయాలని కోరారు.