16 August, 2026 | 3:18 PM

Districts - Siddipet

article_50015535.webp
చెత్త బండికి హెలికాప్టర్ రెక్కలు.. హుస్నాబాద్‌కు అవార్డు కిరీటం!

హుస్నాబాద్, ఆగస్టు 15 : వ్యర్థాల సేకరణలో వినూత్న ఆలోచనతో హుస్నాబాద్ మున్సిపాలిటీ మరో ఘనత సాధించింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం, డ్రై వేస్ట్‌ సేకరణతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ‘డ్రై హెలీ’ శకటానికి శనివారం ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.సాధారణ తోపుడు బండిని హెలికాప్టర్‌ ఆకారంలో రూపొందించి ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తూ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జ్యూట్‌ బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ప్రజల్లో పర్యావరణ చైతన్యం కల్పిస్తున్న ‘డ్రై హెలీ’ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మంత్రి పొన్నం ప్రభాకర్‌, జిల్లా కలెక్టర్‌ హైమావతి చేతుల మీదుగా మున్సిపల్‌ కమిషనర్‌ టి. మల్లికార్జున్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ రవికుమార్‌, జవాన్ పైస శ్రీకాంత్, సిబ్బంది అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దండి లక్ష్మి, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందిని అభినందించారు.

15-08-2026

article_77028863.webp
స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో విద్యార్థుల సందడి

కొండపాక, ఆగస్టు 15: కొండపాక మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, గ్రామాల్లో జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని శాంభవి మోడల్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భరతమాత,మహాత్మా గాంధీ, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్ తదితర స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

15-08-2026

article_72153404.webp
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

చేర్యాల,ఆగస్టు 15 (విజయక్రాంతి): 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల పట్టణంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు, నామినేటెడ్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

15-08-2026

article_25696110.webp
దేశ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలి

సిద్దిపేట రూరల్,ఆగస్టు15: (విజయక్రాంతి): దేశ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలని కోదండరావుపల్లి గ్రామ 5 వ వార్డు మెంబర్ బొంగరం భాగ్యమ్మ అన్నారు. కోదండరావుపల్లిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా బొంగరం భాగ్యమ్మ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. అలాగే పాఠశాల విద్యార్థులకు పెన్నులు, పరీక్షల ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వి ఆర్ ఆర్ ఆర్ టీం సభ్యుడు బొంగరం రజినీకాంత్ రెడ్డి తోపాటు గ్రామ యువకులు విద్యార్థులు పాల్గొన్నారు.

15-08-2026