5 September, 2026 | 9:45 PM

ఇందిరమ్మ మంజూరు పత్రాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

05-09-2026 | 07:48pm

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసం వద్ద బాన్సువాడ నియోజకవర్గం వర్ని, చందూర్, మోస్రా మండలాలకు సంబంధించి 121 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను, నియోజక వర్గంలోని 98 మంది ముఖ్యమంత్రి సహాయ నిది లబ్ధిదారులకు రూ 30,86,750/- ల చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని 11 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ 3,40,000/-, బాన్సువాడ గ్రామీణ మండలం 13 మంది లబ్ధిదారులకు రూ.3,61,500, బీర్కూర్ మండలం 8 మంది  లబ్ధిదారులకు రూ 2,54,000/-, నసురుల్లబాద్ మండలం 15 మంది లబ్దిదారులకు రూ 5,32,500/-మోస్రా మండలం ఐదుగురు.లబ్దిదారులకు రూ.90,500/- చందూర్ మండలం ముగ్గురులబ్దిదారులకు రూ 70,000/-వర్ని మండలం 21 మంది లబ్దిదారులకు రూ  7,24,750/-రుద్రుర్ మండలం 5 మంది లబ్దిదారులకు రూ 1,84,000/-కోటగిరి మండలం నలుగురు లబ్దిదారులకు రూ 1,30,000/-పోతంగల్ మండలం 11 మంది లబ్ధిదారులకు రూ 3,39,000/- ఇతరులు ఇద్దరు లబ్ధిదారులకు రూ 60,500/-ల చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు