ఊట్లలో వీధి కుక్కల పట్టివేత
21-08-2026 08:50 AM
జిన్నారం ఆగస్ట్ 21: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ఊట్ల గ్రామంలో వీధి కుక్కల బెడద నివారణకు చర్యలు చేపట్టారు. గురువారం జూబ్లీహిల్స్ బ్లూ క్రాస్ సిబ్బంది గ్రామంలో పర్యటించి 28 వీధి కుక్కలను పట్టుకున్నారు. ఊట్ల కౌన్సిలర్ బత్తుల మహేష్ యాదవ్ దగ్గరుండి బ్లూ క్రాస్ సిబ్బందికి సహకరించి కుక్కలను పట్టించారు. గ్రామంలో వీధి కుక్కల సంఖ్య పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు కౌన్సిలర్ తెలిపారు.






