సౌదీ సెగ.. విమానాలకు బ్రేక్‌!

25-10-2026 | 11:28am

న్యూఢిల్లీ: సౌదీ అరేబియా(Saudi Arabia)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, ఆకాశ్ ఎయిర్ సంస్థలు పలు నగరాలకు వెళ్లే విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.

ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు రియాద్, దమ్మామ్ నగరాలకు వెళ్లే విమానాలను నవంబర్ 7 వరకు, జెడ్డా సర్వీసులను అక్టోబర్ 31 వరకు రద్దు చేశాయి. అక్టోబర్ 24లోపు టికెట్లు బుక్(Book tickets) చేసుకున్న ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణ తేదీ మార్చుకునే అవకాశం కల్పించడంతో పాటు, పూర్తి రీఫండ్ అందించనున్నట్లు వెల్లడించాయి.

మరోవైపు, ఇండిగో సంస్థ జెడ్డా, దమ్మామ్, మదీనా నగరాలకు నడిచే విమాన సర్వీసులను అక్టోబర్ 31 వరకు నిలిపివేసింది. ఆకాశ్ ఎయిర్ సైతం జెడ్డాకు వెళ్లే విమానాలను నవంబర్ 10 వరకు, రియాద్ సర్వీసులను నవంబర్ 30 వరకు రద్దు చేసింది.

విమానాల రద్దుతో ముఖ్యంగా ఉమ్రా యాత్రికులు, సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జెడ్డాలోని భారత కాన్సులేట్ అప్రమత్తమై 24 గంటలూ అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాధితులకు ఆహారం, మందులు అందిస్తోంది. అలాగే, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లపై సూచనలు, మార్గదర్శకాలు అందిస్తోంది.

మరిన్ని వార్తలు