సీఎంఆర్ అక్రమాలపై సీఐడీ కొరడా

25-10-2026 | 11:36am

హుజూరాబాద్‌లో రైస్ మిల్లు యజమాని అరెస్ట్

జమ్మికుంటలోనూ ముగ్గురు మిల్లర్లు, మహిళలను అదుపులోకి 

హుజూరాబాద్,అక్టోబర్ 25:(విజయక్రాంతి):  కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) సరఫరాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మెరుపు దాడులు నిర్వహించారు. పట్టణ శివారులోని వరంగల్ రహదారిపై ఉన్న వరలక్ష్మి రైస్ మిల్లు యజమాని కల్లూరు కృష్ణమూర్తిని ఆదివారం ఉదయం అదుపులోకి(Rice Mill Owner Arrested) తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి అప్పగించాల్సిన నాణ్యమైన సన్న బియ్యానికి బదులుగా దొడ్డు బియ్యం సరఫరా చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సీఐడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా, జమ్మికుంటలోనూ సీబీ-సీఐడీ పోలీసులు తెల్లవారుజామున పలువురు రైస్ మిల్లర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించి ముగ్గురు మిల్లర్లతో పాటు మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వారిని ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారనే విషయంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. వరుస దాడులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్లలో కలకలం రేగింది.

మరిన్ని వార్తలు