ద్వారక వెంచర్ గణపతి లడ్డూ రూ.90,999/-
కైవసం చేసుకున్న బుడికె గంగా జీవన్ దంపతులు
గజ్వేల్, సెప్టెంబర్ 25: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో(Ganesh Navratri festival) భాగంగా గజ్వేల్లోని ఎన్సీఆర్ ద్వారక వెంచర్లో(NCR Dwarka Venture) ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూ వేలం పాట ఉత్సాహభరితంగా సాగింది. కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటాపోటీగా వేలం పాడారు. చివరకు బుడికె గంగా జీవన్ దంపతులు రూ.90,999కు గణపతి లడ్డూను కైవసం చేసుకున్నారు. విఘ్నేశ్వరుడి లడ్డూ వేలంలో దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు గంగా జీవన్ తెలిపారు.
గణనాథుడి కృపతో అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు లేదా తదుపరి ఉత్సవాల నిర్వహణకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్, వెంచర్ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.