రైతు రిజిస్ట్రేషన్ ప్రత్యేక క్యాంపెయిన్
ములకలపల్లి,సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఈనెల 30వ తేదీ వరకు రైతు రిజిస్ట్రేషన్ ప్రత్యేక కాంపెయన్స్ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు(Agriculture Officer Arun Babu) శుక్రవారం తెలిపారు.
* సెప్టెంబర్ 22 నుండి 30 వరకు గ్రామాలలో ప్రత్యేక కాంపెయిన్స్.
* రైతు ఐడీ పొందుదాం !ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుదాం !.
* రైతు ఐడి ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తింపు*
* రైతుకు ఉన్న భూములన్నీ ఒకే చోట*
ఫార్మర్ రిజిస్ట్రీ అంటే ఏమిటి?.
దేశంలోని ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ఒక ప్రత్యేకమైన రైతు గుర్తింపు సంఖ్య ఉండేలా రైతు వివరాలను నమోదు చేసే విధానమే ఫార్మర్ రిజిస్ట్రీ.
దీని వలన ప్రయోజనాలు ఏమిటి?.
* రైతు పేరు మీద ఉన్న భూములన్నీ ఒకే చోట కనిపిస్తాయి.
* నిజమైన రైతులను గుర్తించడంలో సులభం.
* పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను రైతులకు అందజేయడానికి అవకాశం.
* వరి, పత్తి, మొక్కజొన్న కంది మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి
ఫార్మర్ రిజిస్ట్రీ ఎక్కడ చేసుకోవచ్చు?.
* వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)
* మీ సేవ కేంద్రం
* కామన్ సర్వీస్ సెంటర్ (CSC)
ఏ పత్రాలు తీసుకెళ్లాలి?.
* ఆధార్ కార్డు
* పట్టాదారు పాస్‌బుక్
* ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్
రైతు ఐడి ద్వారా పొందగల ప్రయోజనాలు ఏమిటి.
* FFS ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సేవలు
* బ్యాంకుల ద్వారా పంట రుణాలు
* కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను పొందడానికి
* సబ్సిడీలు మరియు ఇతర రైతు సేవలు.
ఫార్మర్ రిజిస్ట్రీ ఎప్పుడు చేసుకోవాలి?
సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న రైతు రిజిస్ట్రీ ప్రత్యేక గ్రామాల క్యాంపెయిన్‌లో రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని రైతు ఐడి పొందాలి.
ఇప్పటివరకు రైతు రిజిస్ట్రీలో నమోదు కాని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఆన్ లైన్ లో రైతు ఐడి అయింది అని ఎలా తెలుసుకోవొచ్చు?.
ఆన్ లైన్ లో రైతు ఐడి తెలుసుకునే విధానం.
* కింద తెలిపిన లింక్ ఓపెన్ చేయండి.
https://tlfr.agristack.gov.in/farmer-registry-tl/#/checkEnrolmentStatus
* ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
* OTPపై క్లిక్ చేయండి.
* OTP ఎంటర్ చేయండి.
* రైతు ID స్క్రీన్‌పై కనిపిస్తుంది.
రైతు ఐడి ఉన్నవారు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఫార్మర్ ఐడి చేసుకొని రైతుల జాబితా వ్యవసాయ అధికారులు గ్రామాల వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
ఏమైనా సందేహాలు ఉంటే మీ దగ్గరలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించగలరు.
రైతులు అందరు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.