వృద్ధ దంపతులపైకి దూసుకొచ్చిన కారు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కీర్తి నగర్ (Kirti Nagar)లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్య సమాజ్ మందిర్ (Arya Samaj Mandir) సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధ దంపతులను వెనుక నుంచి వచ్చిన SUV ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో 79 ఏళ్ల వృద్ధుడు, ఆయన 71 ఏళ్ల భార్య తీవ్రంగా గాయపడ్డారు. కారు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో వృద్ధుడు గాల్లో ఎగిరి రోడ్డుపై బలంగా పడిపోయినట్లు సమాచారం. ప్రమాద దృశ్యాలు (Accident Visuals) స్థానికంగా ఆందోళన కలిగించాయి.
ప్రమాదంలో గాయపడిన వారిని దయానంద్, కుసుమ టాగ్రా (Dayanand, Kusuma Tagra)గా పోలీసులు గుర్తించారు. ఇద్దరినీ వెంటనే ఆస్పత్రికి (Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ప్రమాదానికి కారణమైన SUVను నడిపిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిని 49 ఏళ్ల నవ్లీన్ (Navleen)గా గుర్తించారు. ఆమె కీర్తి నగర్‌కు చెందిన హోమ్‌మేకర్ (Homemaker)గా పోలీసులు తెలిపారు.ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ (Arrest) చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ప్రమాదానికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.