పాముల సంరక్షణ అందరి భాద్యత.!

04-10-2026 | 03:40pm

- పాము కాటు పట్ల మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి

- అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర

అచ్చంపేట, అక్టోబర్ 4: వన్యప్రాణి వారోత్సవాలు–2026(Wildlife Week Celebrations–2026)లో భాగంగా అచ్చంపేట పట్టణంలోని ఎన్‌టీఆర్‌ స్టేడియంలో వాకర్స్‌ క్లబ్‌ సభ్యులకు పాముల సంరక్షణ, రక్షణపై అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్నేక్‌ క్యాచర్‌ సుమన్, జూనియర్‌ అసిస్టెంట్‌, అచ్చంపేట ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ హన్మంతు నాయక్‌ పాముల వివిధ జాతులు, విషపూరిత–విషరహిత పాముల గుర్తింపు, వాటి ఆవాసాలు, ప్రవర్తన, పర్యావరణంలో వాటి ప్రాధాన్యతను వివరించారు.

ఇళ్లలోకి పాములు ప్రవేశించినప్పుడు వాటిని చంపకుండా దూరంగా ఉండి శిక్షణ పొందిన స్నేక్‌ రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. పాముకాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. పాములు ఎలుకలు తదితర హానికర జీవుల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పాములను భయంతో చంపకుండా, వాటి ప్రాధాన్యతను తెలుసుకుని సహజీవనం చేయడమే వన్యప్రాణి సంరక్షణ అని అవగాహన కల్పించారు. జిల్లా అటవీ అధికారి రేవంత్‌ చంద్ర, ఐఎఫ్‌ఎస్‌ ఆధ్వర్యంలో వన్యప్రాణులు, జీవవైవిధ్య పరిరక్షణపై మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు