నగలే టార్గెట్.. వృద్ధురాలు బలి
కామారెడ్డి,సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో వృద్దురాలు దారుణ హత్య(Brutal murder)కు గురైంది. నాలుగు తులాల బంగారు నగలు లాక్కొని, వృద్ధురాలి నీ తోసి వేయడంతో మెట్ల పైనుంచి పడి మృతి చెందింది. కామారెడ్డి పట్టణంలోని గంజ్ స్కూల్(Ganj School) సమీపంలోని కొఠారి గల్లీలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కొఠారి గల్లీలో నివాసముంటున్న చిటిమెల్లి అనసూయ (75) ఇంటి ముందు నిలబడిన వృద్ధురాలి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కొని, ఆమెను నెట్టివేసిన గుర్తుతెలియని దుండగులు. దింతో మెట్ల పైనుంచి కిందపడటంతో అనసూయ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
వృద్ధురాలి మెడలోని బంగారం కోసం సుమారు 3 గంటలపాటు ఆ గల్లీలో రెక్కీ నిర్వహించిన గుర్తుతెలియని దుండగులు.ఘటనపై కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. వృద్ధురాలు మెడలో నగలను టార్గెట్గా చేసుకొని దుండగులు దోచుకుని దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. కాంగ్రెస్ నాయకుడు చిట్టి మిల్ల విష్ణు తల్లి అనసూయను గుర్తుతెలియని దుండగులు నగలు దోచుకుని హత్య చేసి పరరావడం కలకలం రేపుతుంది. కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.