బీజేపీపై మధుయాష్కి ఫైర్
29-09-2026 | 02:40pm
హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం(Central Government) వివక్ష చూపుతోందని కాంగ్రెస్ నేత మధుయాష్కి(Madhu yashki) ఆరోపించారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. రాముడి పేరును రాజకీయంగా ఉపయోగించుకుని బీజేపీ(BJP) ఓట్లు పొందిందని మధుయాష్కి వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్రం నుంచి అవసరమైన నిధులు తీసుకురావడంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి నిధులు సాధించడంలో మరింత చొరవ అవసరమని పేర్కొన్నారు.