ఎఫ్‌పీవోలకు ఎగుమతులపై అవగాహన

02-10-2026 | 05:10am

అపెక్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో..

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓస్) అంతర్జాతీయ మార్కెట్లను అందుకోవడమే లక్ష్యంగా ‘ఎగుమతి అభిసరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని అపెక్స్ బ్యాంక్ కార్యాలయం(Apex Bank Office)లో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఆధునిక మార్కెట్ అవకాశాలు, ఎగుమతి ప్రక్రియలు, అంతర్జాతీయ ప్రమాణాలు, ఆర్థిక సహాయం వంటి అంశాలపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ఎఫ్పీవోలు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లేందుకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు. మార్కెటింగ్ అవకాశాలపై టీజీ మార్క్ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఎన్. రాజలరావు మార్కెటింగ్ అవకాశాలను వివరించారు. ఆర్థిక సహాయం, రుణ సదుపాయాలపై టీజీసీఏబీతో పాటు నాబార్డ్ నుంచి అందుబాటులో ఉన్న సహకారం గురించి వివరించారు. ఎఫ్‌పీల సంస్థాగత సామర్థ్యాన్ని పెంచేందుకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎఫ్పీవీలు, ప్రభుత్వ శాఖలు, ఆర్థిక సంస్థలు, ఎగుమతి సంబంధిత సంస్థల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు