విషాదం.. విద్యుత్ షాక్ తగిలి

02-10-2026 | 11:54am

కరెంట్ షాక్‌తో రైతు దంపతుల దుర్మరణం

గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) గంభీరావుపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. పంట పొలం వద్ద విద్యుత్ షాక్( Electric Shock) తగిలి రైతు దంపతులు దుర్మరణం చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మండల కేంద్రానికి చెందిన గంట దేవయ్య (70), ఆయన భార్య గంట లక్ష్మి (60)లు శుక్రవారం పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ ఐ శ్రీకాంత్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైతు దంపతుల మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు