ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
22-09-2026 | 10:41am
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్ 21: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారి అభ్యున్నతికి నిస్వార్ధంగా కృషి చేసేది ఉపాధ్యాయులేనని ఎంపీడీఓ(MPDO) పల్లపు ఝాన్సీ అన్నారు. సోమవారం అర్వపల్లిలోని ఎమ్మార్సీ(MRC)లో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని మండల విద్యాధికారి బాలునాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను శాలువాలు, మెమెంటో, ప్రశంసాపత్రాలు, అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డి ఎల్లయ్య,జిల్లా అవార్డు గ్రహీతలు ఎన్ మంజుల,వెంకటేశ్వర్లు,రాములు,వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.