పేకాట రాయుళ్ల అరెస్ట్

22-09-2026 | 12:39pm

పటాన్ చెరు: పటాన్‌చెరు పోలీస్ స్టేషన్(Patancheru Police Station) పరిధిలోని పార్థ రైస్ మిల్లులో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరం(poker establishment)పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసులు మొత్తం 16 మంది పేకాట రాయుళ్లను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. రూ 54,900 నగదును, పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా హమాలీలు, కిరాణా షాపుల నిర్వాహకులు, మెకానిక్ పనులు చేసుకునే సామాన్య కార్మికులుగా పోలీసులు గుర్తించారు.నిషేధిత జూద క్రీడలపై పటాన్‌చెరు పోలీసులు నిఘా ఉంచారని, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు