25 August, 2026 | 1:08 AM

ఫర్టిలైజర్స్ షాప్ తనిఖీ

25-08-2026 12:00 AM

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 24 (విజయ క్రాంతి): వానకాలం 2026 బోనస్ కు ఎంపిక  చేసిన ఏడురకాల వరి సన్నరకాలు - బీపీటీ  5207, తెలంగాణ సోనా, కెఎన్ మ్ 1638, కెఎన్ మ్ 7751, జై శ్రీరామ్, డబ్ల్యూ జి ఎల్ -44, హెచ్ ఎమ్ టి సోనా రకాల వడ్లు సాగు చేస్తున్న రైతులు విత్తనం కొన్న డీలర్ వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఆర్.శేషిధర్ రెడ్డి , సహాయ వ్యవసాయ సంచాలకులు సూచించారు.

యూనివర్సిటీ సీడ్ మేళ, రీసెర్చ్ సెంటర్ వద్ద ఈ రకం విత్తనాలు కొనుగోలు చేసినట్లయితే రైతులు సoబంధితదిత ఏ ఈ ఓ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండలంలోని రాఘవేంద్ర ఫెర్టిలైజర్స్ ను తనిఖీ చేశారు.  వరి రకాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు  రానున్న 10 రోజులలో ఇట్టి రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకోవాలనీ విజ్ఞప్తి చేస్తున్నారు ,ఈ కార్యక్ర మంలో వ్యవసాయ అధికారులు ఎం ఏ ఓ అధికారి విద్యాధరి తదితరులుపాల్గొన్నారు.