క్యాన్సర్ బాధితురాలికి ఆర్థిక సాయం
24-09-2026 | 01:37pm
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లెందు పట్టణంలోని జేకే కాలనీకి చెందిన శ్రీవల్లి క్యాన్సర్(Cancer)తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆమెకు క్యాన్సర్ మూడో దశలో ఉన్నట్లు నిర్ధారించడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విషయం తెలుసుకున్న ఇల్లందు మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య మానవతా దృక్పథంతో స్పందించి రూ.10 వేల ఆర్థిక సాయం(Financial assistance) అందించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి చికిత్సకు అండగా ఉంటామని తెలిపారు. శ్రీవల్లి చికిత్సకు దాతలు, సేవా సంస్థలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. సాయం చేయదలచిన వారు ఫోన్‌పే/గూగుల్‌పే ద్వారా 93915 22612 నంబర్‌కు పంపాలని విజ్ఞప్తి చేశారు.