11వ రోజు పుష్ప అలంకరణతో దర్శనమిస్తున్న సిద్ధి గణపతి
24-09-2026 | 02:33pm
పటాన్ చెరు, సెప్టెంబర్ 24: ఇస్నాపూర్ మున్సిపాలిటీ (Isnapur Municipality)రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ది గణపతి దేవస్థానంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా నేడు 11వ రోజు వివిధ రకాల పుష్ప అలంకరణ విశేష వర్ణంతో ప్రత్యేక దర్శనమిస్తున్న సిద్ధి గణపతి ఉదయం పంచామృత అభిషేకం హోమము విశేష అలంకరణతో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని సిద్ధి గణనాథుని దర్శించుకున్నారు అనంతరం నిత్య అన్నదానంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈఓ లావణ్య జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్,ఆలయ సిబ్బంది, అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.