దౌల్తాబాద్ లో వినాయక్ చౌక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
19-09-2026 | 02:58pm
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎస్పీ, పరితోష్ పంకజ్, పర్హీన్ షేక్
హత్నూర సెప్టెంబర్ 19: మండలంలోని దౌల్తాబాద్ లో వినాయక్ చౌక్(Vinayak Chowk) ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, తహసిల్దార్ పర్హీన్ షేక్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.పురోహితులు మాణిక్ శర్మ, కన్నయ్య పంతులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు కొన్యాల వెంకటేశం, వావిలాల నరసింహులు, కొన్యాల సతీష్, వినాయక్ చౌక్ సభ్యులు చంద్రమోహన్, కొన్యాల శ్రీనివాస్, అనిల్ గౌడ్, తరుణ్, రాజు, సాయి, శ్రీకాంత్ గౌడ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.