4 September, 2026 | 11:44 PM

Petrol, Diesel Prices Hike: మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

25-05-2026 | 10:07am
  1. లీటర్ పెట్రోల్‌ మీద రూ.2.84, డీజిల్‌ మీద రూ.2.86 చొప్పున పెంపు
  2. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.58, డీజిల్ రూ.103.74
  3. విజయవాడలో పెట్రోల్ రూ.117.19, డీజిల్ రూ.104.88.
  4. 10 రోజుల్లో 4 సార్లు పెంపు.. ఇంకా పెంచే అవకాశం.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు(Fuel prices hike) మరోసారి భారీగా పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్(Petrol, Diesel Prices Hike) ధరను లీటరుకు రూ.2.84, డీజిల్ ధరను లీటరుకు రూ.2.86 చొప్పున పెంచాయి. సవరించిన ఈ ధరలు సోమవారం ఉదయం 6 గంటల నుండి అమల్లోకి వచ్చాయి. ఇటీవలి వారాల్లో ఇంధన ధరల పెంపు ఇది నాలుగవసారి.

తాజా సవరణ తర్వాత, ఢిల్లీలో లీటరు పెట్రోల్(Petrol) ధర రూ. 102.12 కాగా, డీజిల్ ధర రూ.95.20కి చేరింది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.111.21కి, డీజిల్ ధర  రూ.97.83కి పెరిగింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర  రూ.107.77గా, డీజిల్ ధర  రూ.99.55గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. విజయవాడలో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర  రూ.117.19గా, డీజిల్ ధర  రూ.104.88గా ఉంది. గుంటూరులో పెట్రోలు ధర లీటరుకు  రూ.117.59గా, డీజిల్ ధర  రూ.105.28గా నమోదైంది.

దేశవ్యాప్తంగా తాజాగా పెరిగిన ధరల నేపథ్యంలో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు  రూ.115.58కు, డీజిల్  రూ.103.74కు విక్రయించబడుతోంది. వరసగా పెట్రోల్ ధరలు పెరగడంతో వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పైసల్లో పెరిగిన పెట్రోధరలు ఇప్పుడు రూపాయిల్లో పెరగడం మొదలైంది. ఇంధన ధరలు పెంపు  ఉబర్ (Uber), రాపిడో (Rapido) క్యాబ్‌లు, ఆటోలు, బైక్ రైడ్‌లు, ఫుడ్ డెలివరీ (Food Delivery), స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) వంటి వాటిల్లో సర్వీసులు అందింస్తూ పొట్ట నింపుకుంటున్న వారిపై అధికంగా ప్రభావం చూపనుంది. ఇప్పటికే పెట్రోధరల పెంపుపై గిగ్ వర్కర్లు  దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించిన విషయం తెలిసిందే.