5 September, 2026 | 12:50 AM

వెయ్యి రోజుల పాలనపై మేడ్చల్లో బిఆర్ఎస్ పార్టీ నిరసన ప్రదర్శన

04-09-2026 | 11:41pm

బిఆర్ఎస్ పార్టి మేడ్చల్ అసెంబ్లీ ఇంచార్జి:సిహెచ్ మహేందర్ రెడ్డి

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై మేడ్చల్లో జాతీయ రహదారిపై బిఆర్ఎస్ పార్టి మేడ్చల్ అసెంబ్లీ ఇంచార్జి చామకూర మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వంట వార్పు చేపట్టి నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగిందని మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజి చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ తెలిపారు.

ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు 420 హామీలను అమలు చేస్తామని చెప్పి ఒక్క హామి కూడా అమలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో వృద్ధాప్య, వికలాంగుల, అవిటివాళ్ళకు, పింఛన్లు పెంచుతామని హామి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసిందని మహేందర్ రెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు పదవిరమణ తర్వాత ఇవ్వాల్సిన బెనిఫిట్ లు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన చెప్పారు. కేవలం మా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన సక్రమంగా కొనసాగిందని ఉత్సవాలు జరుపుకుంటే రాష్ట్ర ప్రజలు ముక్కుమీద వేలు ఎసుకొని పగులబడ నవ్వుతున్నారని మహేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం జాతీయ రహదారిపై నిర్వహించిన వంట వార్పు భోజనాలను ప్రజలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు వడ్డించారు.