దామరచర్ల లో ఘనంగా గణేష్ ఉత్సవాలు

18-09-2026 | 05:30pm

ప్రత్యేక పూజలు  నిర్వహించిన ఎమ్మెల్యే

దామరచర్ల :సెప్టెంబర్ :18 దామరచర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను శుక్రవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Bathula Lakshma Reddy) సందర్శించారు.ఈ సందర్భంగా  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి , ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కల్పించాలని, నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.అనంతరం ఆయా గణేష్ ఉత్సవ కమిటీల (Ganesh festival committees) ఆధ్వర్యంలో భక్తుల కోసం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని, భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రజలలో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావం, సామాజిక సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు.ఈ కార్యక్రమాల లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు, యువత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు