గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
09-09-2026 | 01:21pm
కామారెడ్డి, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కామారెడ్డి రూరల్ సిఐ శ్రీధర్ గౌడ్(Rural CI Sridhar Goud) అన్నారు. బుధవారం కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి లో గణేష్ మండపాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. డీజే లు ఉపయోగించవద్దని సూచించారు. సీరియల్ నెంబర్ ప్రకారం నిమజ్జన శోభాయాత్ర చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో దేవునిపల్లి ఎస్సై రంజిత్, రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజా గౌడ్, మాజీ గ్రామ సర్పంచ్ లు రామా గౌడ్, ఆనంద్ రావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.