1 నుంచి ఆధార్ ఉంటేనే గ్యాస్

20-09-2026 | 05:15am

ఎస్పీజీ సిలిండర్ల బుక్కింగ్‌కు బయోమెట్రిక్ తప్పనిసరి: కేంద్రం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: సబ్సిడీ వంటగ్యాస్(Cooking gas) బుకింగ్‌కు అక్టోబర్ 1 నుంచి ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ(Aadhaar biometric authentication) తప్పనిసరి కానుంది. ఇప్పటికే ధ్రువీకరణ పూర్తి చేసిన వారికి ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇంకా చేసుకోనివారు మాత్రం మార్కెట్ రేట్‌(Market rate)కు ఎల్పీసీ సబ్సిడీ సిలిండర్లను కొనుగో లు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు శనివారం కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంకా ఈ ప్రక్రియను పూర్తి చేయని వారు, ధ్రువీక రణ పూర్తయిన తర్వాత సబ్సిడీ రీఫిల్ బుకింగ్‌(Subsidized Refill Booking)ను ప్రారంభించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.

సెప్టెంబర్ 19 నాటికి 27.43 కోట్ల మంది, అంటే 89.9 శాతం గృహ ఎల్పీజీ వినియోగదారులు తమ ధ్రువీకరణ పూర్తి చేశారు. మిగిలిన వారు డెలివరీ సమయంలో, డిస్ట్రి బ్యూటర్ షోరూమ్‌ల్లో లేదా ఇండియన్ ఆయిల్ వన్, హలో బీపీసీఎల్, హెచ్‌పీ పే యాప్‌ల ద్వారా ధ్రువీకరణ చేసుకోవచ్చు. ధ్రువీకరణ చేయని వారు సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరకు ఎల్పీజీ గ్యాస్‌ను పొందాల్సి ఉంటుంది.

నకిలీ, అనర్హ కనెక్షన్లను తొలగించడం, సబ్సిడీ సిలిండర్ల దుర్వినియో గాన్ని అరికట్టడమే ఈ చర్య లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రభుత్వం తొలుత జూన్ 30 లోగా బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణను పూర్తి చేయాలని వినియోగదారులను కోరింది. కానీ ఆ తర్వాత గడువును జూలై 31, ఆగస్టు 7, ఆగస్టు 15, ఆగస్టు 23, ఆగస్టు 31, సెప్టెంబర్ 7, చివరిగా ఈ నెల 14 వరకు పలుమార్లు పొడిగించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు