20 August, 2026 | 5:44 PM

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

20-08-2026 05:07 PM

మూటకొండూర్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.