ఎస్ఆర్కె అపార్ట్మెంట్ లో వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు
రేపు మహా అన్నదాన ప్రసాద పంపిణీ
నేరేడుచర్ల సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): నేరేడుచర్ల పట్టణంలోని ఎస్.ఆర్.కె అపార్ట్మెంట్ లో వరుసగా ఆరవ వార్షిక గణపతి నవరాత్రి ఉత్సవాలు(Ganapati Navaratri Celebrations) వైభవంగా జరుగుతున్నాయి. అపార్ట్మెంట్ లో 42 ప్లాట్ల యజమానులంతా ఒకే కుటుంబంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఇరువురు దంపతులు పీఠలపై కూర్చుంటుండగా వేద పండితులు ఇరు వంటి శ్రీపాద శర్మ స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు.
ఉత్సవాలలో భాగంగా 5వ రోజు శుక్రవారం లక్ష్మీ గణపతి పూజను సాంప్రదాయ బద్దంగా అత్యంత భక్తిశ్రద్దలతో జరిపించారు. రేపు మహా అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు అపార్ట్మెంట్ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అపార్ట్మెంట్ కమిటీ అధ్యక్షులు బోనగిరి అంజయ్య, చిత్తనూరు రామకృష్ణ, అరబండి కిరణ్ కుమార్, సుంకరి క్రాంత్ కుమార్, కందిబండ హరిప్రసాద్,యీగా శ్రీనివాస రావు,రాచకొండ శ్రీనివాసరావు, రావులపల్లి రోశయ్య, కురువెళ్ల రవి, శ్రీరామ్ తరుణ్, కంది బండ కిరణ్, శానం నరసయ్య, ఆదినారాయణ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.