అట్టహాసంగా ఆరంభం

20-09-2026 | 05:15am
  1. ఆలరించిన ఆసియా క్రీడల ఆరంభోత్సం
  2. హార్మోనిక్ హార్ట్ బీట్  థీమ్‌తో నిర్వహణ
  3. ప్రతిబింబించిన జపాన్ సంస్కృతి
  4. భారత పతాకధారులుగా మను బకార్, పవన్

* ఆసియా దేశాల క్రీడాసంబరం అట్టహాసంగా మొదలైంది. రంగురంగుల వెలుగు లు, హైటెక్ సాంకేతికత,జపాన్ సాంప్రదా య సంస్కృతుల కలయికతో ఆరంభ వేడుకలు ఆకట్టుకున్నాయి. హార్మోనిక్ హార్ట్ బీట్ థీమ్‌తో సాగిన ఈ వేడుకలు అందరినీ అలరించాయి. భారత పతాకధారులుగా షూటర్ మను బాకర్, కబడ్డీ కెప్టెన్ పవన్ సెహ్రావత్ వ్యవహరించారు. 

నగోయా, సెప్టెంబర్ 19: ప్రతిష్టాత్మక 20వ ఆసియా క్రీడలు(Asian Games) ప్రారంభమయ్యాయి. జపాన్‌(Japan)లోని నగోయా నగరం(Nagoya City)లో ఉన్న మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియం(Mizuho Park Athletic Stadium) ఆరంభ వేడుకలు శనివారం అత్యంత అట్టహాసంగా జరిగాయి. జపాన్ చక్రవర్తి నరుహిటో(Naruhito) ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ వేడుకలను హార్మోనిక్ హార్ట్ బీట్ అనే థీమ్‌తో నిర్వహించారు. ఆసియా ఖండంలోని అథ్లెట్లు, ప్రేక్షకులు(Athletes, spectators) అందరి హృ దయ స్పందనలు ఒకటేనని చాటిచెప్పే విధంగా స్టేడియం మధ్యలో ఒక పెద్ద గుండె ఆకారంలో స్టేజ్‌ను రూపొందించారు.

ప్ర ముఖ జపనీస్ దర్శకుడు యుకిహికో త్సు త్సుమి ఈ కార్యక్రమానికి క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. జపాన్ ప్రముఖ వ యలిన్ విద్వాంసుడు తారో హకాసే వయలిన్ సోలో ప్రదర్శనతో కార్యక్రమం మొదలైంది. గుండె ఆకారపు రెక్కలు కలిగిన ఏంజెల్ డ్రోన్లు స్టేడియం చుట్టూ కాంతులీనుతూ తిరిగాయి. జపాన్ సాంప్ర దాయ ’కబుకి’ నృత్యాలు, భారీ నగోయా కోట బెలూన్, ఫ్లయింగ్ లయన్ డ్యాన్స్‌లతో పాటు జపాన్ పారిశ్రామిక రంగాన్ని ప్రతిబింబిస్తూ రోబోలు, టొయోటా భవిష్యత్ మొబిలిటీ వాహనాలు, వందలాది మంది డ్యాన్సర్ల ప్రద ర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తం 45 దేశాల ప్రతినిధులు ఈ మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ జట్టు మొదటగా రాగా, ఆతిథ్య జపాన్ జట్టు చివరగా స్టేడియంలోకి ప్రవేశించింది. భారత జట్టు తరఫున డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, స్టార్ షూటర్ మను భాకర్, కబడ్డీ కెప్టెన్ పవన్ సెహ్రావత్ భారత జాతీయ పతాకధారులుగా వ్యవహరించి భారత బృందాన్ని ముందుండి నడిపించారు. షాట్‌పుట్ ప్లేయర్ తజిందర్‌పాల్ సింగ్ జెర్సీ కిట్ సకాలంలో అందకపోవడంతో చివరి నిమిషంలో పవన్ సెహ్రావత్ ఫ్లాగ్ బేరర్‌గా వచ్చారు.

ఐదు సార్లు ఆసియాడ్ బంగారు పతక విజేత మురోఫుషి షిగెనోబు మరియు అతని కుమారుడు, 2004 ఒలింపిక్ ఛాంపియన్ కోజి మురోఫుషి కలిసి సంయుక్తంగా క్రీడా జ్యోతిని వెలిగించారు. అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ గేమ్స్‌లో 45 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత్ నుంచి 30కి పైగా క్రీడల్లో 503 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. 2022 ఆసియా క్రీడల్లో భారత్ 106 పతకాలతో నాలుగో స్థానంలో నిలవగా, ఈ సారి అంతకంటే మెరుగైన ప్రదర్శన కనబరచాలని భారత్ బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని వార్తలు