హాకీలోనూ అదుర్స్
ఫైనల్లో భారత పురుషుల జట్టు
ఉత్కంఠ పోరులో పాక్‌పై గెలుపు
నగోయా, అక్టోబర్ 1: ఆసియా క్రీడల(Asia Games) హాకీలో భారత్ దుమ్మురేపుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పురుషుల హాకీ జట్టు(Hockey Team) ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై అద్ఙుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ 4 గోల్స్ తేడాతో పాక్‌ను నిలువరించింది. చివర్లో భారత ఆటగాడు అభిషేక్ అద్భుతం చేశాడు.
40 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో అభిషేక్ అనూహ్య రీతిలో గోల్ కొట్టి భారత్‌ను చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో భారత్ 4 గెలిచి ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అటు భారత మహిళల హాకీ జట్టు కూడా ఫైనల్‌కు చేరింది.ఆసియా క్రీడల్లో ఇలా ఒకే ఎడిషన్‌లో భారత హాకీ మహిళల, పురుషుల జట్లు ఫైనల్‌కు చేరడం 1998 తర్వాత ఇదే తొలిసారి.