గ్రూప్ స్టేజ్‌లోనే భారత్, పాక్ పోరు

05-10-2026 | 05:15am

వన్డే వరల్డ్ కప్ 2027 షెడ్యూల్ విడుదల

కేప్‌టౌన్, అక్టోబర్ 1: వన్డే ప్రపంచ కప్ 2027(Cricket World Cup 2027) షెడ్యూల్ విడుదలైంది. దక్షిణాఫ్రికాలో ని కేప్‌టౌన్ వేదికగా ఐసీసీ(ICC) దీనిని విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్ 2027 అక్టోబర్ 2న ప్రారంభమై నవంబర్ 21న జరిగే ఫైనల్ పోరుతో ముగియనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లోని 12 స్టేడియాల్లో మొత్తం మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 12 జట్లు తలపడే ఈ మెగా సమరంలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో చోటు దక్కించుకున్నాయి.

లీగ్ దశలోనే దాయాదుల మధ్య హై-వోల్టేజ్ పోరు జరగనుండటంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. క్వాలిఫైయర్ మ్యాచ్‌ల ద్వారా అర్హత సాధించే జట్లతో కలిపి పూర్తి షెడ్యూల్ ఖరారవుతుంది. ఈసారి ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్‌తోపాటు ఆరు సార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఆతిథ్య జింబాబ్వే ఉన్నాయి. క్వాలిఫైయర్ ద్వారా మరో జట్టు ఈగ్రూప్‌లో చేరుతుంది. గ్రూప్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ మరో క్వాలిఫైయర్ జట్టుతో తలపడనున్నాయి.

భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ 

అక్టోబర్ 7 : భారత్ X ఆస్ట్రేలియా (కేప్ టౌన్)

అక్టోబర్ 10 : భారత్ X పాకిస్తాన్ (జోహెనస్ బర్గ్)

అక్టోబర్ 14 : భారత్ X ఆఫ్గనిస్తాన్ (షానే)

అక్టోబర్ 17  : భారత్ X క్వాలిఫైయర్ ఏ (బ్లూ ఫాంటెన్)

అక్టోబర్ 24 : భారత్ X జింబాబ్వే (విక్టోరియా ఫాల్స్)


మరిన్ని వార్తలు