మంటల్లో ఏటీఎం.. క్యాష్ మాత్రం సేఫ్

06-10-2026 | 08:02am

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఇండియా ఏటీఎం (India ATM) మంగళవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.లక్ష మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire Department) సకాలంలో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో ఏటీఎం యంత్రానికి (ATM Machine) పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో ఏసీ, కంప్యూటర్‌తో పాటు పలు ఎలక్ట్రిక్ పరికరాలు కాలిపోయాయి. అయితే ఏటీఎంలో ఉన్న నగదుకు ఎలాంటి నష్టం జరగకుండా కాపాడగలిగామని ఫైర్ అధికారి రాజేందర్ రెడ్డి తెలిపారు.


మరిన్ని వార్తలు