పంచాయతీ పనులపై పంచాయతీ! కలెక్టర్‌కు ఫిర్యాదు
బెజ్జంకి, అక్టోబర్ 5 (విజయక్రాంతి): బెజ్జంకి మండలం దాచారం గ్రామ సర్పంచ్‌పై (Sarpanch) గ్రామానికి చెందిన కనగండ్ల తిరుపతి సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిధుల వినియోగం (Funds Utilisation), తీర్మానాలు లేకుండా చేపట్టిన పనులు, గ్రామసభ నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.
పంచాయతీరాజ్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్లపై తీర్మానాలు లేకుండా ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు పనులు చేపట్టారని ఆరోపించారు. అలాగే పాఠశాలల్లో తీర్మానాలు లేకుండా అంగన్వాడీ భవనాలు, ప్రహరీ గోడ పనులు చేపట్టడంతో ఆటస్థలం, పల్లె ప్రకృతి వనానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. పీహెచ్సీ వద్ద సుమారు 40–50 ఏళ్ల వేపచెట్టును (Neem Tree) ఎలాంటి తీర్మానం లేకుండా నరికివేశారని కూడా ఫిర్యాదులో ఆరోపించారు. అక్టోబర్ 2న గ్రామసభ (Grama Sabha) నిర్వహించలేదని తెలిపారు.
అన్ని అంశాలపై నిష్పక్షపాతంగా విచారణ (Impartial Inquiry) జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కనగండ్ల తిరుపతి కలెక్టర్‌ను కోరారు.