సెయిలింగ్, రెజ్లింగ్‌లో రజతాలు
- సత్తా చాటిన మను నితేశ్
- స్కాష్‌లో రెండు కాంస్యాలు
- ఆర్చరీలో కాంస్యం గెలిచిన గణేశ్
- సెపక్‌తక్రాలో పతకం ఖాయం
ఆసియా క్రీడల్లో గురువారం భారత్‌కు స్వర్ణాలు దక్కకపోయినా పలు ఈవెంట్లలో రజతాలు, కాంస్యాలు వచ్చాయి. సెయిలింగ్, రెజ్లింగ్‌లో రజతాలు దక్కగా, ఆర్చరీ, స్కాష్‌తో పాటు ఆర్చరీలో కాంస్యాలు లభించాయి. అటు సెపక్‌తక్రాలో కూడా పతకం ఖాయమైంది.
నగోయా, అక్టోబర్ 1: ఆసియా క్రీడల(Asian Games) 13వ రోజు పోటీల్లో భారత్ సెయిలర్లు, రెజ్లర్లు సత్తాచాటారు. సెయిలింగ్ విభాగంలో భారత్‌కు తొలి రజత పతకం లభించింది. పురుషుల స్కిఫ్ పోటీలలో భారత జోడీ మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ అద్భుత ప్రదర్శన చేసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.
తొమ్మిది రేసుల సిరీస్‌లో భారత ద్వయం మొత్తం 23 నెట్ పా యింట్లతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ దక్కించుకుంది. ఈ పోటీలో చైనాకు చెందిన వెన్ జైడింగ్, లియు తియాన్ జోడీ (16 నెట్ పాయింట్లు) బంగారు పతకాన్ని సాధించగా, హాంకాంగ్ జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.కేరళకు చెందిన మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ నోబుల్ చిన్ననాటి స్నేహితులు. భోపాల్లోని నేషనల్ సెయిలింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వీరు ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తున్నారు. ఇదిలా ఉంటే రెజ్లింగ్‌లో భారత్‌కు రజతం వచ్చింది.
97 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో భారత రెజ్లర్ నితేశ్ సివాచ్ సిల్వర్ మెడల్ గెలిచాడు. ఫైనల్లో నితేశ్ 0- పాయింట్ల తేడాతో జపాన్ ప్లేయర్ యూరి నకాజాటో చేతిలో పరాజయం పాలయ్యాడు. వాస్తవానికి నితే శ్ గట్టి పోటీ ఇచ్చాడు. గ్రీకో రోమన్ స్టయిల్ రెజ్లింగ్లో గతంలో ఇండియాకు రెండు సార్లు గోల్ మెడల్స్ వచ్చాయి. 1962లో జకర్తాలో జరిగిన గేమ్స్లో 52కేజీల విభాగంలో మాల్వా సింగ్, 97 కేజీల విభాగంలో గణపత్ అండాల్కర్ స్వర్ణ పతకాలు గెలిచారు. ఇక ఆర్చరీలో మరో మెడల్ దక్కింది.
భారత కాంపౌండ్ ఆర్చర్ గణేశ్ మణిరత్నం తిరుమూరు పురుషుల వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించాడు.ఆంధ్రప్రదేశ్ కు చెందిన 20 ఏళ్ల గణేశ్ అద్భుత ప్రదర్శన చేశాడు. వియత్నాంకు చెందిన కాంగ్ డక్‌పై 149- పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. మొత్తం 15 షాట్లకు గాను 14 సార్లు ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించి దాదాపు పర్ఫెక్ట్ స్కోరు నమోదు చేశాడు. అంతకుముందు రోజు జరిగిన పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో సాహిల్ జాదవ్, కుశాల్ దలాల్లతో కలిసి గణేశ్ స్వర్ణ పతకం కూడా గెలుచుకున్నాడు.
దీనితో ఈ ఆసియా క్రీడల్లో అతను రెండు పతకాలు సాధించినట్లయిం ది.సెమీఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ జోంగ్హో చేతిలో 144- తేడాతో ఓడిపోవడంతో గణేశ్ బంగారు పతక రేసు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత పుంజుకుని కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు స్కాష్‌లో భారత పురుషుల, మహిళల జట్లు కాంస్యాలతో సరిపెట్టుకున్నాయి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రెండు జట్లూ సెమీస్‌లోనే నిష్క్రమించాయి. పురుషుల జట్టు మలేషియా చేతిలో పరాజయం పాలైంది.
అభయ్ సింగ్ ఓడిపోయినా, వీర్ చోత్రా గెలవడంతో స్కోరు సమ మైంది. అయితే చివరి పోరులో మలేషియాదే పైచేయిగా నిలిచింది. గత ఎడిషన్‌లో స్వర్ణం సాధించిన పురుషుల జట్టు ఫైనల్ చేరకుండానే కాంస్యంతో ఇంటిదారి పట్టిం ది. మరోవైపు మహిళల విభాగంలో హాం కాంగ్‌పై భారత్ ఓడిపోయింది. కాగా సెపక్‌తక్రాలో భారత్‌కు పతకం ఖాయమైంది. పురుషుల విభాగంలో క్వాడ్రాంట్ గ్రూప్ ఏ మ్యాచ్‌లో వియత్నాంను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక పురుషుల వాలీబా ల్‌లో క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది.