ప్రభుత్వ అధికారులు గ్రామానికి వస్తే సమాచారం ఇవ్వండి

23-09-2026 | 05:27pm

బోథ్ సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): బోటు మండల సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. ప్రత్యేక అధికారి అయిన డీఎస్ఓ నందిని(Special Officer DSO Nandini) ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో వివిధ శాఖల పైన అధికారులు నివేదికను చదివి వినిపించారు.

సమావేశంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కౌట గ్రామ సర్పంచ్ ఓరుగంటి స్వామి మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లోకి వస్తే సర్పంచ్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మండలంలోని ఆయా గ్రామాలకు అధికారులు వెళితే సర్పంచ్లకు ఏమాత్రం చెప్పకుండా వెళ్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ప్రత్యేక అధికారి గారితో పాటు ఎంపీడీవో రమేష్ లు మాట్లాడుతూ ఇకనుండి అలాంటి పొరపాట్లు జరగవని పేర్కొన్నారు. కార్యక్రమంలో మొదట వ్యవసాయ శాఖ పైన సంబంధిత అధికారి రవితేజ నివేదిక చదివి వినిపించారు.

ఆ తర్వాత ఆర్టికల్చర్ అధికారి భూమయ్య మాట్లాడుతూ కంది, కొత్తిమీర పసుపు తదితర పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. అందుకు పంట సాగును బట్టి ప్రోత్సాహంగా డబ్బును అందిస్తున్నామన్నారు. పండ్ల తోటలు పూల తోటలను సాగు చేసినట్లయితే వారు తమ పేరు నమోదు చేయించుకోవాలని కోరారు.. పశుసంవర్ధక శాఖ పైన పసి వైద్యులు సుశీల్ నివేదిక చదివి వినిపించారు. అన్ని గ్రామాలలో పశువైద్య శిబిరాలను నిర్వహించాలని పలువురు సర్పంచులు కోరారు.

పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ మండలానికి మంజూరైన అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని కోరారు. అన్ని గ్రామ పంచాయతీలలో మహిళ సంఘాలకు అవసరమైన భవనాన్ని నిర్మించాలని సూచించారు. ఆంధ్ర విద్యుత్ శాఖ పై చర్చ జరిగింది. తమ గ్రామంలో విద్యుత్తు పోల్స్ పడిపోయిన వాటిని పట్టించుకోవడంలేదనినిగినిసర్పంచ్ వాపోయారు కంటేగాం మిగిలిన గ్రామాలలో మీటర్ల కోసం డీడీలు చెల్లించి ఎదురుచూస్తున్నారని సత్వరమే వారికి మీటర్లు ఇవ్వాలని కోరారు.

తమ గ్రామంలో పాఠశాల నిర్వహణ బాగానే ఉన్నా పిల్లల అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరని ఎంఈఓ మహమ్మద్ హుస్సేన్ దృష్టికితీసుకొచ్చారు. మండలానికి 12 మంది ఉపాధ్యాయులు అవసరం ఉందని ఎంఈఓ పేర్కొన్నారు. టీచర్లకొరత కారణంగా తమ గ్రామాల నుండి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాల పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. బోథ్ సర్పంచ్ అన్నపూర్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కొరత తీర్చే విధంగా చూడాలని ఎంఈఓ కు సూచించారు.

ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మండలంలో 20 బోరుబావులు వేయించడం జరిగిందని అయితే భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా నీటిని వృధా చేయకుండా ప్రజలను చైతన్యం చేయాలని సర్పంచ్లను కోరారు. ఉపాధి హామీలు చేపడుతున్న పనులను ఏపీ ఓ జగ్దేరావు పేర్కొన్నారు. 318 రకాల పనులు చేపట్టే అవసరం ఉందన్నారు. వాటికి సంబంధించిన పనుల జాబితా సర్పంచ్లకు అందించాలని పలువురు సర్పంచులు కోరడం జరిగింది. ఐసిడిఎస్ ఐకెపి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను సూపర్వైజర్ తో పాటు ఏటీఎం గణేష్ వివరించారు....

ఇంటి పన్నులు వసూలు చేయండి ఎంపీడీవో...

గ్రామాలలో ప్రతి ఇంటికి వివిధ వ్యాపారాల నిర్వాహకుల నుండి పన్ను వసూలు చేయాలని ఎంపీడీవో రమేష్ సర్పంచ్లను కోరారు. ఆర్థిక సంఘం నిధులు రావాలంటే గ్రామపంచాయతీలు ఇంటి పనులను పకడ్బందీగా వసూలు చేయాలని సూచించారు. కాగా సమావేశానికి ఆశించిన స్థాయిలో సర్పంచులు హాజరు కావడం పట్ల సర్పంచులను అభినందించారు...

ఫంక్షన్ పథకాలు ప్రజలకు చేరవేయండి....

ప్రభుత్వం నుండి మంజూరు అవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేరే విధంగా చూడాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ కోరారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని వాటిని అరువైన అందరివారికి అందే విధంగా అధికారులు చూడాలని కోరారు.

సమావేశంలో ప్రత్యేక అధికారి డిఎస్ఓ నందిని మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే అర్హులకు రేషన్ కార్డులు మంజూరు అవుతాయన్నారు. రేషన్ సరఫరాలు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళా సర్పంచ్ల అధిక సంఖ్యలో హాజరు కావడం పట్ల హర్షం వ్యక్తపరిచారు.

మరిన్ని వార్తలు