కవిత ఓదార్పు.. అండగా ఉంటాం

23-09-2026 | 05:46pm

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండలం గిన్నెర గ్రామంలో రిమ్స్‌ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఆమె, కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం గిన్నెర గ్రామస్తులతో సమావేశమైన కవిత, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై వివరాలు సేకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు