మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
23-09-2026 | 07:17pm
నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మండల కేంద్రం నకు చెందిన తాడూరి గోవర్ధనాచారి ట్రాక్టర్ మెకానిక్ ఇటీవల మృతి చెందారు. వారి అకాల మరణానికి చింతిస్తూ, దశ దిన కార్యక్రమానికి హజరైన సందర్బంగా విశ్వబ్రాహ్మణ సంఘం(Vishwa Brahmin Association) నేరేడుచర్ల సభ్యులు మృతుని కుటుoబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహయం(Financial assistance)గా ఆరు వేల రూపాయలు అందించారు. దేవులపళ్లి. జనార్ధనాచారి అధ్యక్షులు రూ.1500,వజ్రాల లింగాచారి ప్రధాన కార్యదర్శి రూ.1000, లంకెల పెళ్లి. శంకరాచారి కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు రూ.1000, శీలజు లక్ష్మణాచారి రూ.1500, శీలోజి. సురేంద్రాచారి కార్పెంటర్ యూనియన్ కోశాధికారి రూ.500, పోలోజు రామాచారి రూ.500 లు సహాయంగా అందించారు.