దానం కేసులో కీలక మలుపు
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో(Telangana politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు( Danam Nagender) సంబంధించిన అనర్హత పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. తన అనర్హతపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
ఒకవైపు అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ చర్చ.. మరోవైపు సుప్రీంకోర్టులో(Supreme Court) దానం నాగేందర్ పిటిషన్ విచారణతో బుధవారం తెలంగాణ రాజకీయాల్లో రెండు పరిణామాలు హాట్ టాపిక్ మారాయి. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి మారారు. దీంతో బీఆర్ఎస్ నేతలు దానంపై ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు దానంపై అనర్హత వేటు వేసింది. ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో కొట్లాడి గెలుస్తానని దానం ధీమా వ్యక్తం చేశారు.