భారత్‌కు ఎదురుందా?

20-09-2026 | 05:05am
  1. బంగ్లాతో సెమీస్‌కు రెడీ
  2. గెలిస్తే మెడల్ ఖాయం
  3. ఫేవరెట్‌గా భారత జట్టు

ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌(Asian Games womens cricket)లో భారత జట్టు(Indian team) పతకానికి అడుగుదూరంలో నిలిచింది. ఆదివారం బంగ్లాదేశ్‌(Bangladesh)తో సెమీఫైనల్లో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే పత కం ఖాయమవుతుంది. ఆసియాకప్ విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న భారత మహిళల జట్టు(Indian womens team) స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి ది గింది. అంచనాలకు తగ్గట్టే క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య జపాన్‌ను చిత్తు చేసింది. కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేసి, తర్వాత ఆ లక్ష్యాన్ని ఐదు ఓవర్లలోనే ఛేదించింది. ఆసియాకప్ నుంచీ భారత్ వరుస విజయాలతో దూసుకెళుతోంది.

పాకిస్తాన్, శ్రీలంక వంటి జట్లపై ఏకపక్ష విజయాలతో మంచి ఫామ్‌లో ఉం ది. ప్రస్తుత ఆసియా క్రీడల్లోనూ గోల్డ్ మెడల్ ఫేవరెట్ టీమిండియానే. బ్యాటింగ్‌లో షఫా లీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్, రి ఛా ఘోష్‌లతో అద్భుతమైన లైనప్ ఉంది. ముఖ్యంగా షపాలీ సూపర్ ఫామ్‌లో ఉంది. అటు బౌలింగ్‌లో పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. స్పిన్ విభాగంలో తెలుగమ్మాయి శ్రీచరణి అదరగొడుతోంది.

అలాగే సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సైతం కీలక సమయాల్లో వికెట్లు తీస్తు సత్తా చాటుతోం ది. పైగా జపాన్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తుండడం కలిసొచ్చే అంశం. అయితే బ్యా టింగ్‌లో భారత మిడిలార్డర్‌కు ఎక్కువ సా ర్లు ఆడే అవకాశం రాలేదు. ఒకవేళ టాపార్డర్ విఫలమైతే మిడిలార్డర్ ఎలా ఆడుతుం దనేది చూడాలి. మరోవైపు బంగ్లాదేశ్‌ను త క్కువ అంచనా వేసేందుకు వీలులేదు. 

మరిన్ని వార్తలు