బ్రిడ్జి పనులను ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే
24-09-2026 | 01:22pm
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామం నుండి జాతీయ రహదారి 161కు వెళ్లే రహదారి భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు(MLA Thota Lakshmi Kantha Rao) రూ.50 లక్షలతో బ్రిడ్జి నిర్మాణానికి గురువారం ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, పిట్లం ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు ప్రజాపండరి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, నాయకులు జనార్దన్ రెడ్డి, రామా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.