దేవుళ్ల మధ్య చిచ్చు
- సనాతన ధర్మం, హిందూ మతాన్ని రేవంత్‌రెడ్డి కించపర్చారు
- ఇతర మతాల దేవుళ్ల గురించి మాట్లాడే ధైర్యం ఉందా?
- సోనియా కుటుంబానికి రేవంత్‌రెడ్డి బానిస
- జీఎస్డీపీ ప్రకారం డీలిమిటేషన్ చేయాలని రాహుల్ చెప్పాడా..? అసదుద్దీన్ చెప్పాడా..?
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): దేవుళ్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) విమర్శించారు. రాము డు వేరు, శివుడు వేరంటూ.. సనాతన ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కించపరిచేలా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం ఛీత్కరించుకుంటోందని మండిపడ్డారు. ‘ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే.
ఇది బ్రిటిష్ కాలం నుంచే ఇలా ఉంది. చివరకు ఇప్పుడు దేవుళ్ల మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డికి ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది? హిందువులు అన్ని దేవుళ్లు, దేవతలను పూజిస్తారు. రాహుల్‌గాంధీ కూడా గతంలో శివుడి ఫొటోతో పార్లమెంటులో ఇదే తరహా రాజకీయాలు చేశారు’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, 2023లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి రోజుకో కొత్త నాటకం తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ పదేళ్లు అభివృద్ధి, ప్రజాసంక్షేమాన్ని విస్మరించి.. ఏ నాటకాలు వేశా రో.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా అలాగే చేస్తున్నారని, రాహుల్‌గాంధీ మెప్పు కోసం.. సనాతన ధర్మంపై, రాజ్యాంగ సంస్థలపై రేవంత్ రెడ్డి ఇలాంటి అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ విష యంలో రాహుల్‌గాంధీతో రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నాడని కిషన్‌రెడ్డి అన్నారు. ‘కులాల మధ్య, మతాల మధ్య విబేధాలు.. ప్రజల మధ్య వైషమ్యాలు రేపినంత మాత్రాన.. శివుడినో, రాముడినో విమర్శించడం. మజ్లిస్ పార్టీకి అంటకాగడంతో పాటు సోనియా గాంధీ మెప్పు పొం దినంత మాత్రాన ప్రజల మెప్పు పొందడం సాధ్యం కాదు. మీరు ఇచ్చిన హామీలకు, అమలు చేస్తున్న తీరుకు మధ్య ఎంత తేడా ఉందో అందరూ చూస్తున్నారు ’ అని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
కాంగ్రెస్‌కు అలవాటే..
కులాల పేరుతో చిచ్చు పెట్టడం, మతాల పేరుతో విబేధాలు సృష్టించడం, భాష పేరు తో రెచ్చగొట్టం, ఉత్తరం, దక్షిణం మధ్య విబేధాలు సృష్టించడం స్వాతంత్య్రం వచ్చినప్ప టి నుంచి కాంగ్రెస్ కు అలవాటేనని కిషన్‌రెడ్డి అన్నారు. రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందని, రేవం త్ రెడ్ది కూడా ఇదే పాలసీ అవలంబిస్తున్నారని తెలిపారు.
‘హిందూ దేవుళ్ల గురించి, హిందూ ఆచారాల గురించి.. చాలాసార్లు వాళ్లు మాట్లాడారు. కేసీఆర్ కూడా హిందు గాళ్లు.. బొందు గాళ్లు అని మాట్లాడి ఫాంహౌ జ్కే పరిమితం అయ్యాడు. హిందూ దేవుళ్ల గురించి ఇలా మాట్లాడే మీకు.. ఇతర మతా ల దేవుళ్ల గురించి మాట్లాడే ధైర్యం ఉందా..? ఆ ధైర్యం చేయరు. హిందువుల్లో సహనం ఎక్కువ కాబట్టి.. ఎలా పడితే అలా మాట్లాడతారా..? సోనియా కుటుంబానికి రేవంత్‌రెడ్డి బానిస. తెలంగాణ అభివృద్ధికో.. తెలంగాణ ప్రజల కోసమో ప్రాణ త్యాగం చేస్తానని చెప్పకుండా.. సోనియా కోసం ప్రాణత్యాగం చేస్తానని చెప్పడం సిగ్గుచేటు.
రాజకీయం కోసం.. ఏ గడ్డి అయిన తినేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వెనుకడుగు వేయదు. మహి ళా బిల్లు విషయంలో కూడా పొంతన లేని వాదనలు చేస్తున్నారు. జీఎస్డీపీ ప్రకారం డీలిమిటేషన్ చేయాలని మాట్లాడటం సీఎం స్థా యి వ్యక్తికి తగదు. ఇలాంటి ఆచరణ సాధ్యంకాని, ఆమోదయోగ్యం కాని ప్రతిపాదనలు తీసుకొచ్చాడు. ఈ ఫార్ములాను మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పాడా? లేక అస దుద్దీన్ ఒవైసీ చెప్పాడా..? అందరికీ ఆమోదయోగ్యంగా 50 శాతం మేర సీట్లు పెంచా లని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తే కాంగ్రెస్, రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నారు. 25 ఏళ్లకోసారి డీలిమిటేషన్ చేయాలని గతంలో చట్టం ద్వారా నిర్ణయించినా కూడా ఇప్పుడు సహకరించకుండా మొండిపట్టు పడుతున్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు, 129 సీట్లు ఉన్న దక్షిణాది రాష్ట్రాల కు195 సీట్లకు పెంచుతామని, అందుకు అందరం కలిసి చర్చించి ముందుకు వెళ్దామంటే.. కేంద్ర హోం మంత్రి పార్లమెంటు లో చెప్పినా.. ఇంతవరకు మొండిపట్టు పడుతూ.. బిల్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దేశం హితం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకాన్ని, కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు బాధ్యతారాహి త్యంగా వితండ వాదంతో వ్యతిరేకిస్తున్నారు. దేశాన్ని బీజేపీ, మోదీ ఎలా పాలిస్తారనే అక్కసుతో ప్రతి విషయంలో ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
రాహుల్ వల్లే మోదీపై వ్యతిరేకత రావడం లేదు..
ప్రధాని మోదీపై వ్యతిరేకత రాకపోవడానికి రాహుల్ గాంధీ లాంటి కాంగ్రెస్ నేతలే కారణమని, వితండవాదం, అవగాహనారాహిత్యం తోనే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఛీత్క రించుకుంటున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. ‘మోదీకి ఓట్ చోరీ చేయాల్సిన అవసరం లేదు. మేం ప్రజల హృదయాలను మాత్ర మే చోరీ చేస్తాం. శివుడిని, రాముడిని, సైనికులను విమర్శించడం ద్వారా ప్రజల మద్ద తు పెరుగుతుందనుకుంటే అది మీ మూర్ఖ త్వం. దేశంలో భారీ మార్పులు జరుగుతాయని రాహుల్ గాంధీ కలలు కంటున్నారు.
ఆయన ప్రతిపక్ష నేత హోదాను వేరే వారికి ఇస్తారేమో.. ఇదే ఆయన కలలుగంటున్న పె ద్ద మార్పు కావొచ్చు. భావజాలం వేరైనా దేశ హితం కోసం ఒకటిగా నిలవాలనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. చివరికి నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ దోవల్‌పైనా విమర్శలు చేస్తున్నారు. దేశ రక్షణ కోసం వారు ఇంత వయసులో నూ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్నా రు. అందుకే దోవల్ గారి సామర్థ్యాన్ని, బుద్ధి కుశలతను చూసి అమెరికా వంటి దేశా లు కూడా ఈర్శపడుతున్నాయి’ అని అన్నారు.
తెలంగాణలో ఒక్కొక్కరికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయి..
‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే.. 2024 పార్లమెంటు ఎన్నికలు జరిగా యి. మీ ప్రభుత్వ ఉన్నప్పుడే.. ఓట్ చోరీ జరిగిందని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. అప్పుడు మీరంతా ఏం చేశారు. కళ్లు మూసుకుని కూర్చున్నారా..? సర్ ప్రక్రియ ద్వారా తొలగించిన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
చనిపోయిన వారి పేర్లు, బంగ్లాదేశ్ వెళ్లిపోయిన వారి ఓట్లను కూడా తిరిగి చేర్చాలని కోరుకుంటున్నారా..? తెలంగాణలో ఒక్కొక్కరికి రెండు, మూడు స్థానాల్లో ఓట్లు ఉన్నా యి. వారు ఒకే చోట ఓటేసేలా చేస్తే కూడా మీకు ఇబ్బంది అనిపిస్తోందా..? బెంగాల్లో ఓటింగ్ శాతం పెరగడానికి సర్ ప్రక్రియే కారణం. దొంగ ఓట్లను తీసేయడంతోనే ఇది సాధ్యపడింది. పశ్చిమబెంగాల్లో సర్ తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నా రు. పశ్చిమబెంగాల్లో ఓసారి రాహుల్, రేవంత్ పర్యటించి.. ప్రజల సంతోషాన్ని చూసిన తర్వాత మాట్లాడాలి’ అని ఆయన సూచించారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పభుత్వం ఓడిపోకుండా రేవంత్‌రెడ్డి చూసుకోవాలని కిషన్‌రెడ్డి సవాల్ విసి రారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదే శ్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్ర భుత్వాలు కూలిపోవడం ఖాయమన్నారు. ‘ఈవీఎంలను పెట్టింది కాంగ్రెస్ పార్టీనే.. ఇ ప్పుడు వాటిని తీసేయాలని రాహుల్, కాం గ్రెస్ నేతలు కోరడం సిగ్గుచేటు. కేరళలో, త మిళనాడులో ఈవీఎంలు బాగా పనిచేశా యా..? అప్పుడు ఏం ట్యాంపరింగ్ జరగలే దా..? బీజేపీ ట్యాంపరింగ్ చేస్తే మేమే అధికారంలోకి వచ్చేవాళ్లం కదా..?’ అని కిషన్ రెడ్డి తెలిపారు
రేపు రాష్ట్రానికి అమిత్ షా..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 3న తెలంగాణ వస్తున్నారని, 4న కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. అక్కడి నుంచి కరీంనగర్ వెళ్లి.. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని రాత్రికి ఢిల్లీ వెళ్తారని చెప్పారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నుంచి అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ అభియాన్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు.
బీఆర్ఎస్తో పొత్తు ఉందని ఎవరు చెప్పారు..?
‘బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో పొత్తు పెట్టుకోదు. పొత్తు ఉంటుం దని మేం ఎప్పుడైనా చెప్పామా.. ? కేటీఆర్ పగటి కలలు కనడం మానుకుంటే మంచిదని కిషన్‌రెడ్డి అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో సింగరేణిలో లభించే బొగ్గు నాణ్యతకు అనుకూలంగా బాయిలర్లు ఎందుకు ఏర్పాటుచేసుకోలేదు. కర్ణాటకలో కూడా సింగరేణి బొగ్గు తోనే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ప్రతిష్టాత్మకమైన విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ రామగుండంలోనూ.. సింగరేణి బొగ్గుతోనే విద్యుత్ చేస్తున్నారు. సింగరేణి బొ గ్గుకు అనుగుణంగా యాదాద్రి పవర్ ప్లాంట్ ఎందుకు నిర్మించలేదు. ఎవరి కోసం ఇలా చేశారో కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఖైరతాబాద్ సీటు బీజేపీకే సొంతం
ఖైరతాబాద్ ఎమ్మెల్యే విషయం లో సుప్రీం కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని, ఖైరతాబాద్ సీటు బీజే పీకే సొంతమని ప్రజలంతా బీజేపీకి అనుకూలంగా ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ తీర్పు అం దరు ఫిరాయింపుదారులకు వ్యతిరేకంగా వచ్చిందని, కేసీఆర్, వైఎస్సార్, రేవంత్‌రెడ్డిలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిం చారని ఆయన విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివా స్ రాజీనామా చేయకుండా ఫిరాయింపులు చేసి.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేశారని, దానం నాగేందర్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ ఎంపీ టికె ట్‌తో పోటీచేసి ఓడారని తెలిపారు.