వేధింపులకు ఒకరి బలి

19-09-2026 | 11:05pm

నేరడిగొండ,(విజయక్రాంతి): నేరడిగొండ మండలం(Neredigonda Mandal)లోని సావర్ గాం గ్రామానికి చెందిన అనిల్(35) ఫైనాన్స్ అప్పులు చేశాడు. వారి వేధింపులకు పురుగులమందు తాగి ఆత్మహత్య(commits suicide) చేసుకున్నట్లు ఎస్ఐ ఇమ్రాన్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. అనిల్ మండలంలోని కొర్టికల్ గ్రామ పోస్టుమాన్(Kortika village postman)గా విధులు నిర్వర్థిస్తున్నాడు. అనిల్ పలు ఫైనాన్స్ ల్లో అప్పులు చేయగా, గత నెలకు సంబందించిన కిస్తీ చెల్లించలేదు.

శనివారం విధులు ముగించుకొని మధ్యాహ్నం సావర్ గాం లోని ఇంటికి వస్తుండగా ఫైనాన్స్  సిబ్బంది అనిల్ ను అడ్డగించి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో, పురుగుల మందు తాగి వాంతులు చేసుకున్నట్లు గమనించిన స్థానికులు ప్రైవేటు వాహనంలో బోత్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అనిల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు  కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు